: రిపబ్లిక్ డే నాడు భారత్ పై దాడి... ముంబై ఎయిర్ పోర్టు టాయిలెట్లలో ఐఎస్ లేఖలు

ఈ నెల 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులు చేసి తీరతామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందినవిగా భావిస్తున్న లేఖలు ముంబై విమానాశ్రయంలోని మరుగుదొడ్లలో లభించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ పై దాడులు చేసి తీరతామని సదరు లేఖల్లో ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఐఎస్ లేఖల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఐఎస్ లేఖలపై సమాచారం అందుకున్న కేంద్ర హోం శాఖ దేశంలోని వివిధ పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది.

More Telugu News