: కాంగ్రెస్ వృద్ధ నేత పాలడుగు వెంకట్రావుకు తీవ్ర అస్వస్థత..అపోలోలో చికిత్స

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను నేటి మధ్యాహ్నం కుటుంబ సభ్యులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్స అందిస్తున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్న ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీసీసీ చీఫ్ పదవి కోసం ఆయన ప్రయత్నించారు. రాష్ట్ర రాజకీయాలపై అపార అనుభవం ఉన్న తాను పార్టీని గాడిలో పెడతానని అధిష్ఠానం ముందు తన ప్రతిపాదన పెట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News