: ఫోషియాన్ లో కాల్పులు... సైన్యం చేతిలో ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్ లోని పోషియాన్ లో భారత సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన ఉగ్రవాదులు దశలవారీగా సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మిలిటెంట్ల కోసం సైన్యం భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది.