: 'జమాత్-ఉద్-దావా' సహా పది ఉగ్రవాద సంస్థలపై పాక్ నిషేధం!

జమాత్-ఉద్-దావా, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్, హక్కానీ నెట్ వర్క్ తదితర పది ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్ భూభాగంపై ఉగ్రవాదుల ఆనవాళ్లు లేకుండా చేయాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పర్యటన అనంతరం పాక్ ఈ ప్రకటన చేయటం గమనార్హం.

More Telugu News