: ఒబామా భారత పర్యటన షెడ్యూలు ఖరారు

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బరాక్ ఒబామా పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 25న ఆయన భారత్ విచ్చేస్తారు. మూడు రోజుల పాటు దేశంలో పర్యటించి 27న తిరిగి వెళతారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమవుతారు. అంతేకాకుండా, ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచిన తాజ్ మహల్ ను కూడా దర్శించుకుంటారు. ఒబామా పర్యటన సందర్భంగా, ఢిల్లీతో పాటు ఆయన పర్యటించే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News