: గంగానదిలో తేలియాడుతున్న వందకు పైగా శవాలు... విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, ఉన్నావో పట్టణాల మధ్య గంగానదిపై 100కు పైగా మృతదేహాలు తేలుతూ కనిపించడం సంచలనం సృష్టించింది. చనిపోయిన తమ బంధువులను ముక్తి కోసం గంగలో జారవిడిచి ఉంటారని, అయితే పెద్ద సంఖ్యలో శవాలు కనపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అధికారులు తెలిపారు. నదిపై తేలుతున్న దేహాలకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని, మొత్తం ఉదంతంపై విచారణకు ఆదేశించామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతోనే మృతదేహాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.