: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అక్కినేని అమల భేటీ!
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల నిన్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన ఆమె నేరుగా సీఎస్ కార్యాలయంలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మల్లో ఎవరిని కలిశారన్న విలేకరుల ప్రశ్నకు స్పందించిన ఆమె, తాను సీఎస్ తో భేటీ అయ్యానని చెప్పేసి వెళ్లిపోయారు. భేటీ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన ఆమె తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి అక్కడినుంచి వెళ్ళిపోయారు.