: బోరుబావిలో పడ్డ బాలిక క్షేమం... సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీం
రంగారెడ్డి జిల్లా గండీడు మండలం గోవిందపల్లిలో బోరుబావిలో పడ్డ బాలిక అంజలి కథ సుఖాంతమైంది. రెస్క్యూటీం సభ్యులు బాలికను సురక్షితంగా బయటకు తీశారు. బోరుబావి నుంచి బయటకు తీసిన బాలికను రెస్క్యూటీం సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. తల్లిదండ్రులతో కలిసి పొలం వెళ్లిన బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే రెస్క్యూటీం సభ్యులను అక్కడికి పంపారు. రెస్క్యూటీం సభ్యుల సహాయకచర్యలు స్వల్ప వ్యవధిలోనే సఫలం కావడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది.