: నాన్న కారణంగానే జైలుకెళ్లా: జాకీచాన్ కొడుకు జెసీచాన్
డ్రగ్స్ కేసులో జైలుపాలైన జాకీచాన్ కొడుకు జెసీచాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. తనకు మార్గదర్శిగా నిలవాల్సిన తన తండ్రి తనను పూర్తిగా విస్మరించాడని ఆరోపించాడు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టైనందుకు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నాడు. తల్లి జాన్ లిన్ కు రాసిన లేఖను జెసీచాన్ మీడియాకు విడుదల చేశాడు. ఆ లేఖలోనే అతడు తన తండ్రి జాకీచాన్ పై ఆరోపణలు గుప్పించాడు.
సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ పట్టించుకున్న పాపానపోలేదని వాపోయాడు. ఈ కారణంగానే తను చెడు వ్యసనాలకు బానిసనయ్యానని, చివరకు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని అతడు పేర్కొన్నాడు.