: ఏడుగురు ఉగ్రవాదులను ఉరితీసిన పాక్
ఓవైపు భారత్ పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్, మరోవైపు అంతర్గత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ రోజు ఏకంగా ఏడుమంది ఉగ్రవాదులకు ఉరిశిక్షను అమలుపరిచింది. పాక్ లోని నాలుగు జైళ్లలో వీరికి ఉరి వేశారు. వీరి ఉరితో ఇప్పటి వరకు పాక్ లో ఉరి తీయబడ్డ ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరుకుంది. ఈరోజు ఉరితీయబడ్డ ఉగ్రవాదుల్లో షాహిద్ హనీఫ్, బెహ్రమ్ ఖాన్, మహ్మద్ తల్హా, జుల్ఫికర్ అలీ, ముస్తాక్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నవాజిష్ అలీ ఉన్నారు.