: సంక్రాంతి నాలుగు రోజులు తెలుగు ప్రజలు వణుకాల్సిందే

సంక్రాంతి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసరనుంది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం ఓ ప్రకటన చేసింది. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత చలి పెరగనుందని తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పొడిగాలుల నేపథ్యంలో చలి తీవ్రత పెరగనుందని అధికారులు వివరించారు. తెలంగాణలో పదేళ్ల తరువాత రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. కాగా, విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News