: అత్యాచారం చేసిన వ్యక్తిని నరికి చంపారు

ఆరేళ్ల వయసున్న అమ్మాయిపై అత్యాచారం చేసి, ఏడాది తర్వాత తిరిగొచ్చిన వ్యక్తిని కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బండ్లగూడలో జరిగింది. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిన శీనును స్థానికులు పట్టుకుని, నరికి చంపారు. అయితే, బాలిక తండ్రి, సోదరుడు కలసి శీనును చంపారని పోలీసులు తెలిపారు. శీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More Telugu News