: సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగన్
వైకాపా యువజన విభాగం నేత సుధీర్ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లిన జగన్... సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, సుధీర్ రెడ్డి కుటుంబానికి వైకాపా ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. తర్వాత ఆయన హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. గత నెల 23న రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.