: మేదరమెట్లలో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు... ఒకరి మృతి

ప్రకాశం జిల్లాలో అదుపు తప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. శరవేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కగా నిలబడ్డ ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్లలో నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పి దూసుకువస్తున్న కారును ప్రయాణికులు గుర్తించేలోగానే వారిని ఆ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

More Telugu News