: నేడు కార్యరంగంలోకి అరవింద్ పనగారియా... 'నీతి ఆయోగ్' ఉపాధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ!

దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేయనున్న 'నీతి ఆయోగ్' ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగారియా నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, దాని స్థానంలో 'నీతి ఆయోగ్'ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేవలం అతికొద్ది మంది ప్రాతినిధ్యంతో ప్రణాళికా సంఘం కార్యకలాపాలు సాగించగా, కొత్తగా తెరపైకి వచ్చిన 'నీతి ఆయోగ్'లో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో 'నీతి ఆయోగ్'కు ఎక్కడ లేని ప్రాధాన్యం వచ్చేసింది. ప్రముఖ ఆర్థికవేత్తగా పేరుగాంచిన అరవింద్ పనగారియాను 'నీతి ఆయోగ్'కు ఉపాధ్యక్షుడిగా కేంద్రం ఎంపిక చేసింది.

More Telugu News