: నేడు తెలంగాణలో జగన్ పర్యటన... హన్మకొండలో సుధీర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండకు వెళ్లనున్న ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ నేత సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జగన్ ఇతర ప్రాంతాల్లో పెద్దగా పర్యటించింది లేదు.
అంతేగాక, మహబూబాబాద్ మానుకోటలో ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో ఆయన తెలంగాణలో ఓదార్పు యాత్రకు దాదాపుగా స్వస్తి చెప్పారు. అయితే, పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు ఆయన వరంగల్ వెళుతున్నారు. గతానుభవాల నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.