: సచిన్ కంటే ముందు ధ్యాన్ చంద్ కి ఇవ్వాల్సింది: మిల్కా సింగ్

హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ కు భారత రత్న అవార్డుపై ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ మరోసారి గళమెత్తారు. సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ఇవ్వడం హర్షణీయమే అయినప్పటికీ, ముందు ధ్యాన్ చంద్ కి ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. ధ్యాన్ చంద్ సేవలు దేశానికి చిరస్మరణీయమని ఆయన తెలిపారు. గతంలో కూడా ధ్యాన్ చంద్ కు భారత రత్నపై డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పద్మవిభూషణ్ అవార్డు కోసం సైనా అడగడం సరికాదని ఆయన సూచించారు. సైనాకి అర్హత ఉంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆమె పేరును సిఫారసు చేయాలని ఆయన సూచించారు. అవార్డుకు తన పేరు సిఫారసు చేయాలని అడగడం బాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News