: మేము రెండు సార్లు పెళ్లి చేసుకున్నాం: ఏంజెలీనా జోలీ

హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజెలీనా జోలీ జోడి జంట రెండు సార్లు పెళ్లి చేసుకుందట. అమెరికాలో పిల్లలు, సన్నిహితుల సమక్షంలో జరిగిన పెళ్లి వేడుకకు ముందే ఏంజిలీనా జోలీ-బ్రాడ్ పిట్ ల జోడీ ఒక్కటయ్యారు. గతేడాది ఆగస్టులో పిల్లల సమక్షంలో జరిగిన పెళ్లి తంతుకు ముందే తాము వివాహం చేసుకున్నామని ఏంజెలీనా వెల్లడించింది. 'ఒక రోజు ఫ్రాన్స్ లో నాలుగు గంటల సమయంలో బ్రాడ్ ను కలిసిన తరువాత కొన్ని వివాహ పత్రాలపై సంతకాలు చేసి ఇద్దరం ఒక్కటయ్యా'మని ఏంజెలీనా వివరించింది. అయితే ఫ్రాన్స్ లో చేసుకున్న వివాహం అమెరికాలో చట్టబద్ధం కాకపోవడంతో మరోసారి కాలిఫోర్నియాలో వివాహమాడామని జోలీ తెలిపింది.

More Telugu News