: థరూర్, పుష్కర్ తెల్లవారుజాము వరకు కొట్టుకున్నారట!
కేంద్ర మాజీమంత్రి శశి థరూర్, ఆయన దివంగత భార్య సునందా పుష్కర్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఘర్షణ పడేవారని వారి పనిమనిషి తెలిపాడు. సునంద పుష్కర్ మరణించిన ముందురోజు రాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొట్టుకున్నారని పనిమనిషి నారాయణ్ సింగ్ చెప్పాడు. ఆ గొడవలో కేటీ అనే మహిళ పేరు తరచు వినిపించిందని సింగ్ వెల్లడించాడు. ఈ మేరకు ఆయన వాంగ్మూలమిచ్చాడు. దీంతో ఈ కేసులో పనిమనిషి నారాయణ్ సింగ్ వాంగ్మూలం ప్రధాన పాత్ర పోషించనుంది.
కాగా గత జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో సునందాపుష్కర్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. థరూర్ దంపతులు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో కాకుండా హోటల్ లో ఎందుకున్నారు? ఆ రోజు ఏం జరిగింది? అనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, పొలోనియం 210 లాంటి విషపదార్థం కారణంగా ఆమె హత్యకు గురయ్యారని ఎయిమ్స్ వైద్యులు తేల్చిన సంగతి తెలిసిందే.