: కాకినాడ బీచ్ కు ఎన్టీఆర్ బీచ్ గా నామకరణం: యనమల
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సాగర సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ బీచ్ కు ఎన్టీఆర్ బీచ్ గా నామకరణం చేస్తామని అన్నారు. అలాగే కాకినాడలో శిల్పారామానికి ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.