: శ్రీశైలంలో చిరుత...పరుగులంకించుకున్న భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఓ చిరుత భక్తులను పరుగులు పెట్టించింది. శ్రీశైలంలోని రుద్రునిపార్కు వద్ద చిరుత పులి సంచరిస్తోంది. గతంలో ఒకట్రెండు సార్లు భక్తులకు కనిపించిన చిరుత పులి మరోసారి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన భక్తులు పరుగులంకించుకున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చిరుత నుంచి భక్తులను రక్షించాలని, చిరుతను బంధించి జూ అధికారులకు అప్పగించాలని దేవస్థాన అధికారులు, భక్తులు ఫిర్యాదు చేశారు.