: ఏడు కోట్లు లక్ష్యంగా పెట్టుకుని, పదకొండు కోట్లకు చేరుకున్నాం: మోదీ

జన్ ధన్ యోజన పథకం కింద లక్ష్యాన్ని మించి బ్యాంకు ఖాతాలు తెరిపించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో జరిగిన బీజేపీ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము 7 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు లక్ష్యంగా జన్ ధన్ యోజన పథకం ప్రారంభించామని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా 11 మంది భారతీయులు బ్యాంకు ఖాతాలు తెరిచారని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు తమపై పూర్తి నమ్మకముంచారని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు చేయడం అలవాటైన వారిని వాటికే పరిమితం చేయాలని ఆయన సూచించారు. తాము పరిపాలనలో నిష్ణాతులమని పేర్కొన్న ఆయన, ఢిల్లీ పాలనాపగ్గాలు తమకు అప్పగించాలని కోరారు.

More Telugu News