: జుకెర్ బర్గ్ ను ఓ పాకిస్థానీ ఉరితీస్తానని బెదిరించాడట!
ఫ్రాన్స్ లోని పారిస్ లో పత్రికా కార్యాలయంపై ఆల్ ఖైదా తీవ్రవాదులు విరుచుకుపడ్డ నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు తమకు వచ్చిన బెదిరింపులను గుర్తుచేసుకుంటున్నారు. దీంతో, గతంలో తనను బెదిరింపులకు గురిచేసిన వైనంపై ఫేస్ బుక్ రూపకర్త మార్క్ జుకెర్ బర్గ్ మరోసారి వెల్లడించారు. మహమ్మద్ ప్రవక్త సమాచారాన్ని ఫేస్ బుక్ నుంచి తొలగించాలని పాకిస్థాన్ కి చెందిన ఓ అతివాది జుకెర్ బర్గ్ ను కోరాడు.
ఆ పోస్టు తాను పెట్టింది కాదని, అది యూజర్ పెట్టిందని పేర్కొన్న జుకెర్ బర్గ్, దానిని తీసేసేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆ ఉగ్రవాది తనను ఉరితీసి చంపాలనుకున్నాడంటూ తన ఫేస్ బుక్ పేజ్ జుకెర్ బర్గ్ పేర్కొన్నాడు. దీనిపై పెను దుమారం రేగుతోంది. దీనిపై మరో పాకిస్థానీ కామెంట్ చేస్తూ, ఎవరో ఒకరు చేసిన పనికి జాతి మొత్తాన్ని నిందించడం సరికాదని పేర్కొన్నాడు.
దీనిపై జుకెర్ బర్గ్ స్పందిస్తూ తనకు కూడా పాకిస్థాన్ లో మంచి స్నేహితులున్నారని పేర్కొంటూ, తాను జాతి మొత్తాన్ని నిందించలేదని, అతివాదులను మాత్రమే నిందిస్తున్నానని స్పష్టం చేశాడు. దీంతో పాక్, భారత్ వర్గాల మధ్య ఫేస్ బుక్ లో తీవ్ర పోరు జరుగుతోంది.