: తక్షణమే జైల్లో లొంగిపోండి: సంజయ్ దత్ కు ముంబై పోలీసుల హుకుం
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు మరో చిక్కొచ్చి పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న అతడు ప్రస్తుతం చట్టపర అనుమతితో సెలవులో ఉన్నాడు. అయితే ఇటీవల మంజూరైన సెలవు రెండు రోజుల క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో తిరిగి కారాగారానికి వెళ్లిన సంజయ్ దత్, జైలు గేటు దాకా వెళ్లి తిరిగి వచ్చేశాడు. తనకు మంజూరైన సెలవును మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని అతడు దాఖలు చేసుకున్న పిటీషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో కోర్టు తీర్పు వెలువడే దాకా బయటే ఉండొచ్చన్న అతడి న్యాయవాది సూచనతోనే సంజయ్ దత్ వెనక్కొచ్చేశాడని తెలిసింది.
సంజయ్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన జైలు అధికారులు, పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. కోర్టు విచారణ పేరిట బయట ఉండే అవకాలశాలపై మల్లగుల్లాలు పడిన పోలీసులు, తక్షణమే లొంగిపోవాలని ఆదేశిస్తూ సంజయ్ దత్ కు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. మరి పోలీసుల నోటీసులకు సంజయ్ దత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.