: మీడియా అవాస్తవాలు చెప్పింది: ఫ్రాన్స్
ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరిగిన ఉగ్రదాడుల్లో ఈ రోజు ఎవరూ మృతి చెందలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ప్రకటించారు. ప్యారిస్ లో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ పౌరుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. భద్రతాదళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. కాగా, ఉగ్రవాదులతో భద్రతా దళాలు చర్చలు జరుపుతున్నాయి.