: శ్రీలంక నూతన అధ్యక్షుడికి సోనియా అభినందనలు

శ్రీలంకలో మహింద రాజపక్స పాలన ముగిసింది. కొత్త అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ఎన్నికవడం తెలిసిందే. ఆయన విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. చారిత్రాత్మక విజయం సాధించారంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. సిరిసేన హయాంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం దిశగా సాగాలని సోనియా ఆకాంక్షించారు. శ్రీలంక ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆమె కొనియాడారు.

More Telugu News