: మతంపై కాదు, టెర్రరిజంపై యుద్ధం చేస్తున్నాం: ఫ్రాన్స్ ప్రధాని
ఫ్రాన్స్ లో ఉగ్రవాదులు చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడి చేసి 12 మందిని బలిగొనడం తదనంతర ఘటనల నేపథ్యంలో ప్రధాని మాన్యుయెల్ వాల్స్ స్పందించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ ఉగ్రవాదంపై యుద్ధం చేస్తోందన్నారు. తాము మతంపై పోరాడడం లేదని, టెర్రరిజంపై పోరాడుతున్నామని స్పష్టం చేశారు. కాల్పులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. ఈ ఉదయం ఆయన దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దేశంలో తాజా పరిస్థితులపై చర్చించారు.