: విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం
విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ ప్రణాళిక వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.