: ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు: ఏపీ డీజీపీ రాముడు

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. నేటి ఉదయం కడప జిల్లా పోలీసు అధికారులతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో సిమీ ఉగ్రవాదుల కదలికలున్నాయని చెప్పిన ఆయన ఉగ్ర మూకల కోసం సోదాలు చేస్తున్నామన్నారు. ఉగ్రవాద కదలికలపై మరింత నిఘా పెంచామన్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

More Telugu News