: సంక్రాంతి కోడిపందాలపై వీడని ఉత్కంఠ... సుప్రీం విచారణ సోమవారానికి వాయిదా

సంక్రాంతి నేపథ్యంలో జోరుగా సాగే కోడిపందాలపై మరో మూడు రోజుల పాటు ఉత్కంఠ కొనసాగనుంది. ఈ కేసుపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కోడిపందాలను నిషేధిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేయాలని టీడీపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును శుక్రవారం విచారిస్తామని నిన్న చెప్పిన సుప్రీం ధర్మాసనం, సోమవారానికి వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు విచారణ వాయిదా నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాపీలను పట్టుకుని రంగంలోకి దిగిన పోలీసులు కోడిపందాలపై కేసులు నమోదు చేస్తున్నారు. పందాలకు సన్నాహాలు చేస్తున్న వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారు.

More Telugu News