: సందేశాలు పంపుతున్న ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్
రెండు వారాల క్రితం జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ నుంచి సందేశాలు వస్తున్నట్లు ఇండోనేషియా ఉన్నతాధికారులు నేడు వెల్లడించారు. దీంతో, బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ శోధనను మరింత ముమ్మరం చేశాయి. నేటి ఉదయం సముద్రం అడుగు భాగం నుంచి వస్తున్న సందేశాలను అన్వేషణ బృందాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కాగా, బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బ్లాక్స్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ బాక్స్ ను బయటకు తీస్తామన్న విశ్వాసాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు.