: మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వెంకయ్య... క్యాబినెట్ సమావేశంలో వాదన!
పార్లమెంటులో చర్చ లేకుండానే ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా సంస్కరణలు అమలు చేయాలన్న మోదీ సర్కారు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యతిరేకించినట్టు తెలిసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశం జరగ్గా, ఆర్డినెన్స్ జారీపై చర్చిస్తున్న సమయంలో వెంకయ్యనాయుడు "ఇది తగదు" అని కాస్త గట్టిగానే వాదించినట్టు సమాచారం. ఆయన వాదనతో మోదీతో పాటు మిగతా మంత్రులు ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. కీలక నిర్ణయాలు పార్లమెంటులో చర్చించాకే అమలు చేయాలని వెంకయ్య వాదించగా, ఈ విషయంలో మరోసారి చర్చిద్దామని ఆయనకు సర్ది చెప్పినట్టు తెలిసింది.