: విధ్వంసం కుట్ర భగ్నం... కర్ణాటకలో బాంబులతో దొరికిపోయిన ఉగ్రవాదులు!

భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు సమీకరించి ఉగ్రదాడులకు రూపకల్పన చేస్తున్న ముగ్గురు ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులను కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి శక్తిమంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బెంగళూరు చర్చి స్ట్రీట్ లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో వీరు పాత్రధారులని అనుమానిస్తున్నారు. చిక్ మగళూరు జిల్లాలోని భత్కల్ ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన ఐఎం ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. భత్కల్ ప్రాంతంలో ఉగ్రవాదులనే అనుమానంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు కమిషనర్ అఫ్ పోలీస్ ఎం.ఎన్.రెడ్డి స్పష్టం చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ (34), సద్దాం హుస్సేన్ (35) లతో పాటు ఎంబీఏ చదువుతున్న అబ్బాస్ (24)ను అరెస్ట్ చేశామని వివరించారు. వీరివద్ద అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ టైమర్లు, పీవీసీ పైపులు, ద్రవ ఇంధనం, డిజిటల్ సర్క్యూట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

More Telugu News