: వాహన రంగ చరిత్రలో అత్యధిక జరిమానా ఇదే... హోండాపై అమెరికా కోర్టు ఆగ్రహం

ప్రపంచ వాహన రంగ చరిత్రలో అత్యధిక జరిమానాను జపాన్ సంస్థ హోండా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. హోండా వాహనాలకు జరుగుతున్న ప్రమాదాలు, మృతుల వివరాలు, వారికి అందిన పరిహారం తదితరాలపై సరైన సమయంలో నివేదిక ఇవ్వనందుకు అమెరికా కోర్టు ఒకటి హోండాపై 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ.442 కోట్లు) జరిమానా విధించింది. కస్టమర్ల నుంచి వచ్చిన 1,700 ఫిర్యాదులపై హోండా స్పందించలేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, సురక్షిత విధానాలు పాటించకున్నా, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణ అధికారులకు అందించకున్నా కఠినంగా వ్యవహరిస్తామని యూఎస్ రవాణా శాఖ కార్యదర్శి అంటోనీ ఫాక్స్ హెచ్చరించాడు.

More Telugu News