: వారి దాష్టీకానికి ఒక గ్రామమే బూడిదయింది!

నైజీరియా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ బోకోహరమ్ ఒక గ్రామంపై విరుచుకుపడింది. ఉగ్రవాదులు ఆ గ్రామంలోని అన్ని ఇళ్ళకూ నిప్పుపెట్టారు. వారి క్రూరత్వానికి నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని 'బాగా' గ్రామం కుదేలైంది. సాయుధులైన ఉగ్రవాదులు సమీప గ్రామాలు దొరన్, మిలీ-2లపై కూడా దాడులు చేసి బీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు తెలిపారు. చిన్నారులు, మహిళలు అని చూడకుండా కాల్పులు జరిపారని, తీవ్రగాయాలతో వీధుల్లో సాయం కోసం ప్రజలు అలమటిస్తున్నారని 'బాగా' నుంచి తప్పించుకుని వచ్చిన ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. ఉగ్ర ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News