: ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహకరించుకుంటాయి: ఏపీ డీజీపీ
నేరాలను అదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయని ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం, నిత్యావసరాల అక్రమ రవాణా నియంత్రణకు పరస్పరం సహకరించుకుంటామని అన్నారు. తీర ప్రాంత భద్రత కోసం అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు సమకూర్చనున్నామని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులంతా తెలుగువారేనని ఆయన వెల్లడించారు.