: వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి జట్టును ప్రకటించిన ఆతిథ్య న్యూజిలాండ్
వరల్డ్ కప్-2015లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును పోటీలకు ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు ప్రకటించింది. జట్టుకు బ్రెండన్ మెక్‌కల్లమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని బోర్డు తెలిపింది. ప్రస్తుతం ప్రకటించిన జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉందని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్న పరిస్థితులు తమకు అనుకూలమని జట్టు కోచ్ మైక్ హెస్సన్ అభిప్రాయపడ్డారు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీని ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్ జట్టు: బ్రెండన్ మెక్ కల్లమ్ (కెప్టెన్), కోరె ఆండర్సన్, ట్రెంట్ బౌల్ట్, గ్రాంట్ ఇలియట్, మార్టిన్ గప్తిల్, టామ్ లాథమ్, మిచెల్ మెక్ క్లీనన్, నాథన్ మెక్ కల్లమ్, కైల్ మిల్స్, ఆడమ్ మిల్నే, ల్యూక్ రాంచీ (వికెట్ కీపర్), టిమ్ సౌథీ, రాస్ టేలర్, డానియల్ వెటోరి, కేన్ విలియమ్సన్.