: పారిస్ లో కాల్పులు... పదకొండు మంది మృతి

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఓ వార పత్రిక కార్యాలయంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందారు. చార్లీహెబ్డో మ్యాగజైన్ కార్యాలయంపై ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఈ పత్రిక మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్లు ప్రచురించింది. ఆ సమయంలో పత్రికకు బెదిరింపులు వచ్చాయి. వ్యంగ్య కథనాలకు ఈ వీక్లీ ప్రసిద్ధి. కాల్పుల ఘటనతో పారిస్ లో హై అలర్ట్ ప్రకటించారు. కాల్పుల అనంతరం దుండగులు ఓ టాక్సీని హైజాక్ చేసినట్టు సమాచారం.

More Telugu News