: అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ సంస్థ ఇదేనట!
ఆస్ట్రేలియాకు చెందిన కాంటాస్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా నిలిచింది. ఎయిర్ లైన్ రేటింగ్స్.కామ్ ఈ మేరకు ఓ జాబితా విడుదల చేసింది. విమాన సర్వీసులు, అకౌంట్ల నిర్వహణ, విమానయాన సంస్థల పాలక సంఘాల తీరు, ప్రమాదాల రికార్డు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. మొత్తం 449 ఎయిర్ లైన్స్ సంస్థల్లో కాంటాస్ కే అగ్రపీఠం దక్కింది.
కాగా, ఎయిర్ లైన్ రేటింగ్.కామ్ కాంటాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. కాంటాస్ శాటిలైట్ వ్యవస్థ సాయంతో తన విమానాల ఇంజిన్ల పనితీరును పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఇక కాంటాస్ తర్వాతి స్థానాల్లో ఎయిర్ న్యూజిలాండ్, బ్రిటీష్ ఎయిర్ వేస్, క్యాథే పసిఫిక్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్ వేస్, ఇవా ఎయిర్, ఫిన్ ఎయిర్, లుఫ్తాన్సా, సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.