: తాత్కాలిక నిర్మాణాలు చేసి, రాజధానిని విజయవాడకు మారుద్దాం: చంద్రబాబు

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని... ఆ సమస్యను విజయవంతంగా అధిగమించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విభజన జరిగిన రెండు నెలల్లోనే 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగామని చెప్పారు. విద్యుత్ లోటు ఇప్పుడు జీరో స్థాయికి చేరుకుందని అన్నారు. తాత్కాలికంగా నిర్మాణాలను పూర్తి చేసి, రాజధానిని విజయవాడకు మారుద్దామని చెప్పారు. రెండో విడత రుణమాఫీలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. విజయవాడలో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరుగుతున్న సమావేశంలో చంద్రబాబు పైవివరాలను తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యారు.

More Telugu News