: రెచ్చగొట్టిన వారికి రైతులే బుద్ధి చెప్పారు: చంద్రబాబు

రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేందుకు అధికారులంతా కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. అత్యంత సున్నితమైన రాజధాని భూ సేకరణ ప్రక్రియ ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా కొనసాగుతోందని చెప్పారు. జపాన్, సింగపూర్ దేశాల సహకారంతో కొత్త రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. ఈ నెల 12న సింగపూర్ బృందం మళ్లీ వస్తోందని వెల్లడించారు. భూ సేకరణకు రైతుల బాగా సహకరిస్తున్నారని కొనియాడారు. అన్నిటికీ అడ్డుపడుతూ, రెచ్చగొట్టిన వారికి రైతులే బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. విజయవాడలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహిస్తున్న సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ తెలుగుదేశం ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని తెలిపారు. అర్హులైన వారందరికి పింఛన్లను ఐదు రెట్లు పెంచామని చెప్పారు.

More Telugu News