: టీమిండియాకు షాక్... తొలి ఓవర్ లోనే ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్!
నాలుగో టెస్టులో ఆసీస్ బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. భారత్ తన తొలి ఇన్నింగ్సు తొలి ఓవర్ లోనే తొలి వికెట్ ను కోల్పోయింది. మిచెల్ జాన్సన్ స్థానంలో బరిలోకి దిగిన మైఖేల్ స్టార్క్ తన తొలి ఓవర్ మూడో బంతికే భారత ఓపెనర్ మురళీ విజయ్ ను బోల్తా కొట్టించాడు. స్టార్క్ వేసిన ఓవర్ లో మూడో బంతికే మురళీ విజయ్ బ్రాడ్ హ్యాడిన్ చేతికి దొరికిపోయాడు.
బ్రాడ్ హ్యాడిన్ క్యాచ్ తో... జట్టు స్కోరుతో పాటు తన వ్యక్తిగత పరుగుల ఖాతా తెరవకుండానే విజయ్ వెనుదిరిగాడు. దీంతో అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ(11), మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్(4) తో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు ఓ వికెట్ కోల్పోయి 15 పరుగులు చేసింది.