: నా కూతురు అల్లరి చేస్తోంది... క్రమశిక్షణలో పెట్టండి: పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు

సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తే ఎవరైనా ఏం చేస్తారు? అల్లరి చేయవద్దంటూ కసురుకుంటారు. అల్లరి చేయకుండా ఉంటే ఏదైనా ఇస్తానని ఆశపెడతారు. ఇంకా అల్లరి చేస్తే రెండు తగిలిస్తారు. విదేశాల్లో పిల్లలను శిక్షించడంపై ఆంక్షలు ఉండడంతో, తన కుమార్తె భరించలేనంత అల్లరి చేస్తోందని, క్రమశిక్షణలో పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడో పెద్దమనిషి. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. 12 ఏళ్ల తమ కుమార్తె మాట వినడంలేదని, ప్రతి విషయానికీ గొడవ పడుతోందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతవారం సోదరితో వాగ్వివాదానికి దిగిందని, ఆమెను దండించే అధికారం లేక, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని అతను వాపోయాడు. పోలీసులకు కూడా దండించే అధికారం లేదు. దీంతో, ఆమెను ఎలా క్రమశిక్షణలో పెట్టాలో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు.

More Telugu News