: కృష్ణానదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థులు

సరదా కోసం కృష్ణా నదిలో దిగిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహధాటికి గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు వద్ద జరిగింది. గల్లంతైన విద్యార్థుల్లో ఒకరి మృత దేహం దొరికింది. మిగిలిన ఇద్దరి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విద్యార్ధులు ఇలాంటి చోట్లకు వెళ్లి సరైన రక్షణ లేకుండా నదిలో దిగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నది ప్రమాదకరంగా ఉన్న చోట కనీసం హెచ్చరికలతో ఉండే బోర్డులు కూడా పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News