: అమిత్ షా అంచనాల మేరకు రాణించని టి.బీజేపీ నేతలు... ప్రక్షాళనకు సిద్ధమైన అమిత్

తెలంగాణలో బలపడటానికి మంచి అవకాశాలున్నా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని, ఆశించిన మేర ప్రభావం చూపలేకపోతున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రభావం చూపకపోతే, రానున్న ఎన్నికల నాటికి అధికారం అందుకునే స్థాయికి చేరుకోలేమని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రేపు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, తెలంగాణ నేతలకు ఆయన క్లాస్ కూడా పీకుతారని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి అమిత్ సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని స్వతంత్ర సంస్థల నుంచి నివేదికలను కూడా తెప్పించుకున్నారని సమాచారం. బీజేపీ తెలంగాణ నాయకత్వం ఇదే ధోరణిలో ముందుకు సాగితే, రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అమిత్ అంచనా వేస్తున్నారు.

More Telugu News