: స్మగ్లర్లతో దాడులు చేయిస్తున్న తెలుగుదేశం నేతలు: రోజా విమర్శలు
స్మగ్లర్లను తన అదుపులో ఉంచుకున్న ముద్దు కృష్ణమనాయుడు విపక్షానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అండతో ముద్దు కృష్ణమనాయుడు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. నగరి మునిసిపల్ చైర్ పర్సన్ శాంతిపై నిన్న జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని రోజా విమర్శించారు. గతంలో జాతర సమయంలో తనపై కూడా దాడి జరిగిందని, ఇప్పుడు మునిసిపల్ చైర్ పర్సన్ పై దాడి చేశారని తెలిపారు. ఈ దాడులకు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారని రోజా ప్రశ్నించారు.