: మావోలు కూడా మన సమాజంలో భాగమే...వసూళ్లు తప్పుకాదు: బీహార్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రాజకీయనాయకులు తమను మించిన వారు లేరంటున్నారు. వారిలో బీహార్ ముఖ్యమంత్రి జతిన్ రాం మాంఝీ ప్రథముడు అనాలేమో. పాట్నాలోని ఆయన అధికారిక నివాసంలో నిర్వహించిన జనతాదర్బార్ లో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని దోచుకుంటూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు డబ్బు వసూలు చేయడంలో తప్పులేదని అన్నారు. ''మావోయిస్టులు విదేశీయులా? మావోయిస్టులుగా మారినవాళ్లు కూడా మన సమాజానికి చెందినవాళ్లే. అభివృద్ధి ద్వారా వాళ్లను మళ్లీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావచ్చు గానీ, తుపాకులతో బెదిరించలేం'' అని ఆయన పేర్కొన్నారు. రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, ఇతర ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు డబ్బు వసూలు చేయడంలో తనకు తప్పు కనిపించడం లేదని ఆయన పేర్కోవడంతో వివాదం రేగుతోంది. తాను మంత్రిగా పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందిన వారు చేస్తున్న అవినీతిని మావోయిస్టులే వివరించారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News