: కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఏపీ ఉల్లంఘిస్తోంది: మంత్రి జగదీశ్ రెడ్డి

ఎంసెట్ వివాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను ఏపీ ప్రభుత్వం అడుగడుగునా ఉల్లంఘిస్తోందన్నారు. చట్టాలకు అనుగుణంగా ఎవరైనా నడుచుకోవాల్సిందేనన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లోగోను ఈరోజు మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచీ ఏపీ వాళ్లు ఏదోరకంగా పంచాయతీ పెడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఎంసెట్ నిర్వహిస్తుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగాలనే ఎంసెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు.

More Telugu News