: ఎంసెట్ వివాదంపై గట్టెక్కేదెలా?: చంద్రబాబుతో గంటా సమాలోచనలు

తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని సమస్యలా పరిణమించిన ఎంసెట్ నిర్వహణ వివాదంపై బయటపడేదెలాంటూ ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎంసెట్ నిర్వహణపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంసెట్ ను మేం నిర్వహిస్తామంటే, కాదు మేం నిర్వహిస్తామని ఇరు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజీ యత్నాలు కూడా ఫలించలేదు. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారంపై దృష్టి సారించాలని చంద్రబాబును గంటా కోరినట్లు సమాచారం. మరి చంద్రబాబు మంత్రాంగమైనా ఫలిస్తుందో, లేదో చూడాలి.

More Telugu News