: ధోనీ నిర్ణయంపై లేటుగా స్పందించిన కోహ్లీ
ఎంస్ ధోనీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకడంపై టీమిండియా స్టార్ బ్యాట్స్ మేన్ విరాట్ కోహ్లీ కాస్త ఆలస్యంగా స్పందించాడు. ధోనీ నిర్ణయం షాక్ కు గురిచేసిందని తెలిపాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు హఠాత్తుగా ప్రకటించడంతో జట్టంతా అవాక్కయిందని అన్నాడు. "కారణమేంటో తెలియదు. ధోనీ నుంచి అలాంటి నిర్ణయం వెలువడుతుందని ఊహించనేలేదు. అతని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు, ముఖ్యంగా, క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ మేటి" అని పేర్కొన్నాడు.
ఇక, సిడ్నీ టెస్టులో తాను పూర్తిస్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తుండడంపై స్పందించాడీ ఢిల్లీ డైనమైట్. సానుకూల దృక్పథం కనబరిచేలా ఆటగాళ్లను ప్రోత్సహిస్తానని తెలిపాడు. సిరీస్ కోల్పోయినా ఆసీస్ తో పోరాడతామని స్పష్టం చేశాడు.